Listen to this article

జనం న్యూస్ జనవరి 16 కూకట్పల్లి నియోజకవర్గం ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వర దేవస్థానం కృష్ణా నది ఒడ్డున ఉన్న ఇంద్ర కీలాద్రి పర్వతం పైన ఉంది ఇక్కడ దుర్గాదేవి కోయంబుగా తనకు తానుగా వెలిసిందని క్షేత్ర పురాణంలో చెప్పబడింది అది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీ చక్ర ప్రతిష్ట చేశారని ప్రతిదీ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రి పై కొలువుదిరింది అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది శివ లీలలు శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణంలో అక్కడక్కడ గమనించవచ్చు అని అన్నారు ఈ కార్యక్రమంలో నాగరాజు రాజేశ్వరరావు రవీందర్ రెడ్డి రాజేశ్వరరావు రమేష్ తదితరులు పాల్గొన్నారు