

బిచ్కుంద ఏప్రిల్ 19 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్ పటేల్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం కేంద్రంలో శనివారం నాడు గ్రామపంచాయతీ లో కల్తీ కల్లు నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నార్కోటిక్ శాఖ డి.ఎస్.పి బిక్షపతి , ఎక్సైజ్ శాఖ సీఐ సత్యనారాయణ , సీఐ జగడం నరేష్ ఎస్సై మోహన్ రెడ్డి గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రజలలో కల్తీకల్లు కారణంగా ఆరోగ్యానికి కలిగే నష్టాలు ,చట్టపరమైన చర్యలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. అనంతరం గ్రామస్తులు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు . ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసినారు. అధికారులు మాట్లాడుతూ, కల్తీకల్లు తయారీ, విక్రయాలు చట్టరహితమని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే సంబంధిత అధికారులకు 1908 టోల్ ఫ్రీ నంబరు ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో కల్తీ కల్లు నిర్మూలన సాధ్యమవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, కామారెడ్డి జిల్లా యూత్ ఉపాధ్యక్షుడు యోగేష్, నౌషా నాయక్, ఖలీల్ సీమ గంగారం, సాయిని అశోక్, సిఐటియు నాయకుడు సురేష్ , అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు గ్రామ ప్రజ లు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

