Listen to this article

*మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్*జనం న్యూస్ 2025 ఏప్రిల్ 19 (మెదక్ జిల్లా బ్యూరో సంగమేశ్వర్)మెదక్ మండలం రాజిపల్లికొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో మెదక్ నియోజకవర్గ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావుకొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని మెదక్ నియోజకవర్గ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారుమెదక్ మండలం రాజిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు సంబంధిత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కొనుగోలు కేంద్రాల వసతుల పై ఆరా తీశారు. వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కాంటాలు, తేమ యంత్రాలు, రిజిస్టర్లు తనిఖీ చేశారు. ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు ఉన్నాయా లేవా అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆరా తీశారు. అనంతరం శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించి . రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు