Listen to this article

జనం న్యూస్ జనవరి 16 నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం
దామరగిద్ద: పండగ పూట ఆనం దంగా గడపాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది. చేపలతో ఇం టికి తిరిగి వస్తాడనుకున్న వ్యక్తి మృతదేహమై తేలిన సంఘటన బుధవారం చేసుకుంది. పోలీసుల లక్ష్మీపూర్ గ్రామానికి చెంది కడ్తాల పాండు(38) బతుకు దెరువు కోసం హైదరాబాద్ కు వలస వెళ్లాడు. రెండు రోజుల క్రితం పండగకు గ్రామానికి వచ్చాడు. మంగళ వారం సాయంత్రం స్థానిక ఊర చెరువుకు చేపల వేటకు వెళ్లాడు. ప్రమాద వశాత్తు చెరువులో మునిగిపోయాడు. చీకటి పడినా ఇంటికి తిరిగి రాకపోవడంతో చెరువు గ ట్టుపై కుటుంబసభ్యులు పరిశీలించారు. కట్టు బట్టలు అ క్కడే ఉండడంతో పోలీసులకు సమాచారమందించారు. మరుసటి రోజు చెరువులో పోలీసులు సమక్షంలో చెరు వులో గాలించగా పాండు మృతదేహం బయట పడింది. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అతనికి భార్యలక్ష్మి, కుమారుడు రమేష్ ఉన్నారు.