

జనంన్యూస్. 22. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు. కోటగల్లి శంకర్ భవన్ పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ . పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు కేంద్రప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో విద్య మరియు మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడానికి పీఎం శ్రీ పథకం కింద శంకర్ భవన్ పాఠశాల ఎంపిక చేసి గత సంవత్సరం 27 లక్షలు మరియు అటల్ టింకరింగ్ ల్యాబ్ కొరకు 10 లక్షల నిధులు కేటాయించడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నిధుల ద్వారానే శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధి జరుగుతుందని రాష్ట్రంలో ఉత్తమ పాఠశాలగా శంకర్ భవన్ పాఠశాలను తీర్చిదిద్దాలని విద్య శాఖ అధికారులకు సూచించారు. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వాలు మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలలు పథకాలు పేరుకే పరిమితం అవుతున్నాయి తప్పితే ప్రభుత్వ బడులు మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. ఇందూర్ అర్బన్ నియోజకవర్గంలో పేద, మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్య అందించడమే తన లక్ష్యం అని శంకర్ భవన్ పాఠశాల అభివృద్ధికి తన ట్రస్ట్ ధ్వరా సహకరిస్తానని హామీ ఇచ్చారు.
విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతు విద్యార్థులు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో పోటీ పడి చదవాలని ఉత్తమ ర్యాంకులను సాధించాలని సూచించారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడా & యోగ, వివిధ కళ రంగాలలో కూడా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. విద్యలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు ప్రోత్సాహకరంగా షిల్డ్ బహుమతులను ఎమ్మెల్యే గారు విద్యార్థులకు అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల అధికారి సాయ రెడ్డి, హెడ్ మాస్టర్ రాంచందర్, అమ్మ ఆదర్శపాఠశాల కమిటీ ఛైర్పర్సన్ గోదావరి, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.