Listen to this article

విజయనగరం డిఎస్సీ ఎం.శ్రీనివాసరావు

జనం న్యూస్ 22 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం పట్టణంలో ప్రముఖ వ్యక్తులకు నక్సలైటు పేరుతో బెదిరింపు లేఖలు పంపి, డబ్బు దోచుకోవడానికి ప్రయత్నించిన నకిలీ నక్సలైటు అయిన పెందుర్తి మండలం, చినముషిడివాడకు చెందిన కుచ్చర్లపాటి వెంకట బంగార్రాజు ను విజయనగరం వన్ టౌన్ పోలీసులు ఏప్రిల్ 21న అరెస్టు చేసినట్లుగా వన్ టౌన్ పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ సందర్భంగా విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ – పీపుల్స్వర్ ఎ.ఓ.బి. ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ మరియు ఇన్చార్జ్ యాక్షన్ కమిటీ కామ్రేడ్ సాయన్న అలియాస్ బిర్సా పేరుతో బెదిరింపు లేఖలను విజయనగరం పట్టణంలోని ఇద్దరు ప్రముఖులకు పంపి, ఒకరిని రూ. 25 లక్షలు, మరొకరిని రూ. 20 లక్షలు డబ్బులు డిమాండు చేసినట్లుగా సంబంధిత వ్యక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారన్నారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాలతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన విజయనగరం వన్ టౌన్
పోలీసులు పలు సిసి ఫుటేజులను పరిశీలించి, సాంకేతికత ఆధారంగా బెదిరింపు లేఖలు పంపిన వ్యక్తిని పెందుర్తి మండలం చినముషిడివాడకు చెందిన కుచ్చర్లపాటి వెంకట బంగార్రాజు గా గుర్తించి, అతడి కదలికలపై నిఘా పెట్టామన్నారు. విజయనగరం పట్టణంలో బాలాజీ జంక్షను వద్ద వన్ టౌన్ పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా కుచ్చర్లపాటి వెంకట బంగార్రాజును అరెస్టు చేసి, అతను వినియోగిస్తున్న మోటారు సైకిలు, విప్లవ సాహిత్యం, మొబైల్ ఫోను, ముఖం కనిపించకుండా వినియోగించిన హెల్మెట్ ను సీజ్ చేసామన్నారు. ఈ తరహా నేరాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని, అటువంటి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని విజయనగరం డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు హెచ్చరించారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన సిఐ ఎస్.శ్రీనివాస్, ఎస్ఐ బి. సురేంద్ర నాయుడు, హెచ్సీ ఎ.రమణరావు, కానిస్టేబుళ్ళు పి.శిశ వంకర్, ఎన్.గౌరి శంకర్ లను డిఎస్పీ ఎం.శ్రీనివాసరావు అభినందించారు. విజయనగరం వన్ టౌన్ పోలీసు స్టేషనులో నిర్వహించిన మీడియా సమావేశంలో వన్ టౌన్ సిఐ ఎస్.శ్రీనివాస్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.