

జనం న్యూస్ ఎప్రిల్ 22 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలో
బి జే పి మండల శాఖ అధ్వర్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హిందువులపై రోహింగ్యలు దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంటూ విశ్వహిందూ పరిషత్ మరియు బీర్పూర్ మండల బిజెపి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రోజు స్థానిక తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లోనీ పలు ప్రాంతాల్లో జిహాదీలు హిందువులపై దాడులకు పాల్పడగా 12 మంది మరణించారని 500 మంది గాయాల పాలయ్యారు . హిందువులపై దాడులు జరుగుతున్నప్పటికీ అక్కడ ప్రభుత్వం శాంతి భద్రతలు కాపాడుటంలో పూర్తిగా విపలమైంది కావున వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలి అని డిమాండ్ చేయడం జరిగింది. అనంతరం తాహసిల్దార్ అందుబాటులో లేనందున అందుబాటులో ఉన్న మండల అర్ ఐ రాహుల్ కి వినతి పత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీర్పూర్ మండల విశ్వహిందూ పరిషత్ అధ్యక్షులు బండారి రవి, బీర్పూర్ మండలం బిజెపి అధ్యక్షులు అడేపూ నర్సయ్య, ఇన్చార్జి పాత రమేష్, నాయకులు ఘర్షకుర్తి రమేష్, మామిడిపల్లి లింగన్న, కస్తూరి లక్ష్మణ్, కటిక రెడ్డి సతీష్, ఆడెపు నగేష్, మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.