Listen to this article

సన్మానించిన ధర్మ స్టూడెంట్స్ యూనియన్ & ధర్మ మహిళ జాగృతి

జనం న్యూస్, ఏప్రిల్ 25 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

అణగారిన వర్గాల నుండి దుబ్బాక పట్టణానికి చెందిన గడ్డమీది ప్రభాకర్ – భాగ్యమ్మ దంపతుల, రెండవ కుమార్తె అయిన గడ్డమీది రుచిత, ఎంతో కష్టపడి తన తల్లిదండ్రులు అనుభవించినటువంటి కష్టాలను కళ్ళ ముందు చూస్తూ, తాను ఇలాంటి కష్టాన్ని పారద్రోలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి పదవ తరగతి వరకు మోడల్ స్కూల్లో చదివి, తర్వాత ఇంటర్ ప్రైవేటు సంస్థలో చదివి, సిద్దిపేట జిల్లా ప్రధమ ర్యాంకును సాధించింది. బి.ఆర్. అంబేద్కర్ పూర్తిగా, చదివే ప్రాణంగా భావిస్తూ ఇదే పట్టుదలను కొనసాగిస్తూ జాతీయస్థాయిలో నిర్వహిస్తున్నటువంటి నీట్ ఎగ్జాంలో కూడా నీ యొక్క ప్రతిభను చాటాలని భవిష్యత్తులో తన కల అయిన డాక్టర్ గా ప్రజలకి సేవ చేయాలనీ, అలాగే యువత ఇలాంటి వాళ్లని ఆదర్శంగా తీసుకొని రానున్న తరాలకి ఒక ప్రేరణగా నిలవాలని, గడ్డమీది రుచిత, కి ధర్మ స్టూడెంట్ యూనియన్ , ధర్మ మహిళా జాగృతి & ధర్మ సమాజ్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి రుచిత మరియు తల్లిదండ్రులతో పూలమాల వేయించడం జరిగింది. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ సమ సమాజ అభివృద్ధి కోసం పాటుపడిన బాబాసాహెబ్ అంబేద్కర్,ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలని ధర్మ మహిళా జాగృతి & ధర్మ స్టూడెంట్స్ యూనియన్- ( డి ఎస్ యు ) ఆకాంక్షిస్తుంది అని నాయకులు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ధర్మ మహిళా జాగృతి నాయకురాలు ప్రసన్న మహారాణి , పరమేశ్వరి మహారాణి , లత బోయ పరమేశ్వరి, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు పిరాజి నాయక్, రాజన్,ప్రభాకర్ ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చందు మహారాజ్, డిఎస్పీ నాయకులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు.