

గ్రామ ప్రజల పోరాటానికి తోడుగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
జనం న్యూస్ // ఏప్రిల్ // 24 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )..
హుజురాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ నియోజకవర్గ బి అర్ ఎస్ సీనియర్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఇ సందర్బంగా వారు మాట్లాడుతూ..హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గుండెడు గ్రామ ప్రజలు, క్వారీ యజమాని మనోజ్ రెడ్డి అక్రమాలకు వ్యతిరేకంగా గళం విప్పారన్నారు. పర్యావరణ విధ్వంసం, మోసాలు, హక్కుల భంగానికి వ్యతిరేకంగా ఏంమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ధైర్యంగా గ్రామనికి అండగా నిలబడ్డారన్నారు.కాగా గ్రామ దేవాలయాలకు 25 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చిన మనోజ్ రెడ్డి కేవలం 15 లక్షలు ఇచ్చి మిగతా డబ్బు మింగేశాడన్నారు.ప్రజలు ఏమ్మెల్యే ని ఆశ్రయించగా, వెంటనే స్పందించి మనోజ్ రెడ్డికి ఫోన్ చేసిన కౌశిక్ రెడ్డి ని మనోజ్ అసభ్యంగా అవమానించడం దిగజారుడు చర్య అని మండిపడ్డారు. గ్రామాన్ని నాశనం చేస్తున్న క్వారీ మాఫియా, శబ్ద కాలుష్యం, పంటల నాశనం, పశువుల హాని, ప్రజల ఆరోగ్యానికి ముప్పు, కాబట్టి గ్రామస్తుల ధైర్యవంతమైన ఫిర్యాదు, మనోజ్ రెడ్డి మీద పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా కేసు నమోదు అయినట్టు తెలిపారు.అయితే ప్రజల పక్షాన మాట్లాడుతున్న కౌశిక్ రెడ్డి పై దాడులు ఎందుకు, అని ప్రశ్నించారు. ఒక్క నాయకుడిని ఎదుర్కొనే సత్తా లేకపోవడం వల్లే విమర్శలు, దొంగ కేసులు, పెట్టి కాంగ్రెస్ పార్టీ కావాలనే అసత్య ఆరోపణలు, కుట్రలతో ముద్ర వేయాలని చూస్తోంది అన్నారు. అయినా కౌశిక్ రెడ్డి వెనుకడుగు వేయలేదు అని ప్రజల కోసం పోరాడుతూనే ఉన్నారు అని మచ్చలేని నాయకుడు గా ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు గా, ప్రజలచే
ఎన్నికైన నాయకుడు అని వివరించారు. న్యాయం మరోసారి గెలిచింది, అని హైకోర్టు స్టే ఆర్డర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై పెట్టిన తప్పుడు కేసులపై హైకోర్టు స్టే ఇచ్చినది అని, ఇది న్యాయ వ్యవస్థపై ప్రజల నమ్మకానికి నిదర్శనం అని,కౌశిక్ రెడ్డిని విమర్శించే స్థాయి మీది కాదు అని అన్నారు.బి ఆర్ ఎస్ రజతోత్సవ సభ, ఏప్రిల్ 27న ఎల్కతుర్తి లో గులాబీ నేత కౌశిక్ రెడ్డి నేతృత్వంలో సభను అఖండ విజయవంతం చేయడమే లక్ష్యంగా, వాల్రైటింగులు, బైక్ ర్యాలీలు, జనసమీకరణకు ప్రత్యేక ప్రణాళికలు,కార్యకర్తల్లో నూతన ఊపిరి నింపుతున్నరన్నారు. ఈ సమావేశం లో బండ శ్రీనివాస్ ,తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు, గందే శ్రీనివాస్ ,సురేందర్ రెడ్డి ,పోళ్నేని సత్యనారాయణ రావు ,తక్కళ్లపల్లి సత్యనారాయణ రావు ,కొలిపాక శ్రీనివాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.