

జుక్కల్ ఏప్రిల్ 24 జనం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పెద్ద కోడప్గల్ మండలం కాటేపల్లి గ్రామంలో గురువారం నాడు జొన్న మరియు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సింగిల్ విండో చైర్మన్ జర నాగిరెడ్డి , ఏఈఓ రూప ,కేంద్రాన్ని ప్రారంభించారు. చైర్మన్ మాట్లాడుతూ జొన్నలు గాని వరి ధాన్యాలు గాని దళారులకు అమ్మి మోసపోవద్దని అన్నారు అనంతరం జొన్నలు ఎకరానికి ఎనిమిది క్వింటాలు నుండి 14 కుంటాలవరకు పరిమితి పెంచినందుకు సీఎం కు పాలాభిషేకం చేశారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాలకు ధర 23 20 రూపాయలు, బి గ్రేడ్ వరి ధాన్యానికి 2300 రూపాయలు, మరియు ఒక క్వింటాల జొన్న ధర 3371 రూపాయలు కావున ప్రతి ఒక్క రైతు వరి ధాన్యాలు జొన్నలు గవర్నమెంట్ కాటకు వేసి సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ తెలిపారు ఇట్టి కార్యక్రమంలో చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ గంగా గౌడ్ కార్యదర్శి హనుమాన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొహిద్ది న్ వెంకటరెడ్డి పెంటన్న లలిత గంగారెడ్డి మల్లప్ప పటేల్ కుమ్మరి సాయిలు మొగుల గౌడ్ విట్టల్ రామచందర్ శంకర్ లాలు అశోక్ శ్రీనివాస్ గంగన్న పాండు నాయక్ రైతులు తదితరులు పాల్గొన్నారు
