

జనం-న్యూస్, ఏప్రిల్ 24,(ఏపీ స్టేట్ బ్యూరో చీఫ్/ భండా రామ్):
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన దారుణ మారణకాండను వైసీపీ నేత, ఇంటలెక్చువల్ అధికార ప్రతినిధి బిక్కా రామాంజనేయరెడ్డి ఖండించారు. ఈ ఘటనతో ప్రతి కశ్మీరీ గుండె ముక్కలైందని, మాటలు రావడం లేదన్నారు. గుండెల్లో అంతులేని బాధతో ఇది రాస్తున్నట్లు చెప్పారు. ఇది అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదని కశ్మీర్‌పై జరిగిన దాడిగా అభివర్ణించారు. కశ్మీరీలు మౌనం వీడాల్సిన సమయమిదని, ఈ క్రూరమైన చర్యను ఖండించాల్సిందేనన్నారు. ”ఏప్రిల్ 22, 2025.. పర్వతాలు సైతం మోయలేనంత నిశ్శబ్దం ఆవరించిన రోజు.. ప్రశాంతమైన ప్రకృతి ప్రదేశమైన పహల్గాంలో నెత్తురు చిందిన రోజు.. ప్రతి కశ్మీరీ గుండె పగిలింది. కూర్రమైన, అర్ధరహితమైన ఈ చర్యను చెప్పటానికి మాటలు కూడా రావడం లేదు. అందుకే బరువైన, బాధతో కూడిన హృదయంతో ఇది రాస్తున్నా. మన ఇంటికి వచ్చిన అమాయక అతిథులను దారుణం కాల్చి చంపారు. మన పైన అడవులు, అందమైన సెలయేళ్లు, ప్రశాంత వాతావరణం ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులు భయానక స్థితిని ఎదుర్కొన్నారు. ఈ అనాగరిక దాడి అమాయకులపై జరిగిన దాడి మాత్రమే కాదు, కశ్మీర్‌పై దాడి. శతాబ్దాల సంప్రదాయాలకు జరిగిన అవమానం. మన విశ్వాసాన్ని దెబ్బతీసేలా దుష్ట ప్రయోజనాల కోసం చేసిన దారుణచర్య. కశ్మీరీలంతా దుఃఖంలో ఉన్నాం. ఈ దుశ్చర్యకు మా రక్తం మరిగిపోతోంది” ”ఇలాంటివి జరిగిన ప్రతిసారీ, మనల్ని మనం నిరూపించుకోవాల్సి వస్తోంది. గుర్తింపును కాపాడుకోవడంతో పాటు, చేయని పనికి అవమాన భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో మరోసారి నిస్సందేహంగా చెబుతున్నా. దీనిని అస్సలు క్షమించం.. ఇది నిజంగా భయంకరమైన చర్య. అంతకుమించి పిరికిపంద చర్య” ”ఇలాంటి సమయంలో కశ్మీరులు మౌనంగా ఉండకూడదు. మేము ఎంతో దుఃఖంతో ఉన్నాం. మన ఇంటిలో జరిగిన ఈ క్రూర చర్యకు నిజంగా సిగ్గుపడుతున్నాం. దయచేసి మమ్మల్ని ఈ దృష్టికోణం నుంచి మాత్రం చూడొద్దని వేడుకుంటున్నా. ఇది నిజమైన కశ్మీరీలు చేసింది కాదు. మా తల్లిదండ్రులు హంతకులను పెంచి పోషించలేదు. ఇలాంటి చర్యల పట్ల ఎలాంటి సమర్థన, న్యాయం, విజయం లేదు. ఇది కేవలం సిగ్గుపడాల్సిన అంశం. మీరు (ఉగ్రవాదులు) ఏం ఆశించి ఇలాంటి ఇలాంటి దారుణ హింసకు పాల్పడ్డారో తెలియదు. మీ చర్య కొన్ని కుటుంబాలను నాశనం చేసింది. పిల్లలను అనాథలుగా మార్చింది” ”కశ్మీర్ ఆట స్థలం కాదు. యుద్ధం క్షేత్రం అంతకన్నా కాదు. ఇదేమీ మీరు ఉపయోగించుకునే ఆయుధమూ కాదు. అతిథులకు స్వాగతం పలికి, గౌరవించే ప్రదేశం. ఈ ఘటనలో బాధిత కుటుంబాలు అనుభవించే బాధ వారి ఒక్కరిదే కాదు. మా అందరిది. మీతో మేమూ దుఃఖిస్తున్నాం. మీరు కోల్పోయిన దానికి చింతిస్తున్నాం. మీరు కశ్మీర్లో ప్రశాంతంగా ఉండటానికి వచ్చారు. కానీ, మేము దానిని కాపాడలేకపోయాం. అందుకు క్షమించమని అడుగుతున్నాం” అని వైసీపీ నేత, ఇంటలెక్చువల్ అధికార ప్రతినిధి “బిక్కా రామాంజనేయ రెడ్డి” పోస్టు చేశారు.