

జనం న్యూస్ ఏప్రిల్ 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని సమేల గ్రామంలో 13 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీపీరోడ్డు పనులను గురువారం కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షులు విశ్వప్రసాద్ రావు వాంకిడి మండల అధ్యక్షులు నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు గ్రామాల్లో సిసి రోడ్లు మొరుగుకోవాలని నిర్మాణానికి కృషి చేస్తుందని అన్నారు.ఈ యూత్ అధ్యక్షులు ప్రశాంత్, నియోజకవర్గ యూత్ అధ్యక్షులు దుర్గం జీవన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
