

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు , బిజెపి నాయకులు పోతురాజు మస్తానయ్య దశదినకర్మ కార్యక్రమం సందర్భంగా నేడు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు పాల్గొని చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తోట శివశంకర్, ఆదినారాయణ, మల్లి, రామిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.