Listen to this article

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
జనం న్యూస్.జనవరి 16, కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్:జిల్లాలో అర్హత గల ప్రతి లబ్దిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించే విధంగా అధికారులకు సమన్వయంతో కృషి చేయాలని  జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. గురువారం జిల్లాలోని జైనూర్ మండలం ఊషెగాం గ్రామంలో కొనసాగుతున్న రైతు భరోసా సర్వేలో భాగంగా వ్యవసాయ భూములను క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, రేషన్ కార్డులు ఇతర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర విచారణ జరిపి ఎలాంటి పొరపాట్లు, అవకతవకలు లేకుండా జాబితా రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రజా సంక్షేమ పథకాల అమలు ద్వారా జిల్లాలోని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుదారులలో అర్హులైన వారిని ఎంపిక చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి జాబితాను రూపొందించాలని తెలిపారు. రైతు భరోసా పథకానికి అర్హులైన వారి జాబితా తయారు చేయాలని, వ్యవసాయ అధికారులు రూపొందించిన జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పథకాల వారీగా అధికారులను నియమించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, వ్యవసాయ విస్తరణాధికారి, పంచాయతీ కార్యదర్శి, రెవెన్యూ సిబ్బంది, రైతులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది