

జనం న్యూస్ 26. ఏప్రిల్ : విజయవాడ వన్ టౌన్, భవన్నారాయణ వీధి నందు న్యూ జనరేషన్ యూనిటీ ఆర్గనైజేషన్ కార్యాలయంలో పదో తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు మొదటి సంవత్సరంలో ఉత్తీర్లు అవగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. సంస్థ కార్యాలయంలో పేద విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో మరియు చిన్నపాటి ప్రైవేట్ స్కూల్లో విద్యనభ్యాసిస్తూ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత ట్యూషన్ ద్వారా సభ్యుల సహాయ సహకారాలతో పదో తరగతి సుమారు పదిమంది హాజరవుగా అందులో ఇద్దరు విద్యార్థులు పూర్తిస్థాయిలో చివర వరకు సంస్థ కార్యాలయాన్ని వినియోగించుకొని చదువుకోనగా మిగతా విద్యార్థులు వారి చదువు కొరకు సహాయం పొందినారు అదేవిధంగా ఇంటర్ మొదటి సంవత్సరం ఐదుగురు హాజరవగా అందులో ఇద్దరూ కార్యాలయంలోనే చదువుకుంటూ పదో తరగతి మరియు ఇంటర్ మొదటి సంవత్సరం అందరు కూడా ఉత్తమ ఫలితాలను అందుకున్నారు. విజయోత్సవ సభకు ప్రత్యేక అతిథిగా వెస్ట్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దుర్గారావు పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు అభినందనలు తెలియపరుస్తూ మొబైల్ వాడకంపై, ఇంట్లో తల్లిదండ్రుల క్రమశిక్షణపై, చెడు అలవాట్లపై, తెల్లవారుజామున లేచి చదవటం పట్ల వారి యొక్క లక్ష్యాలు నెరవేర్చుకునే మార్గంపై మరియు వివిధ అంశాలపై ప్రత్యేకంగా వారితో ముఖాముఖి చర్చించారు అనంతరం సంస్థ సభ్యులు వారిని సత్కరించి నిష్కరించిన అనంతరం విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ చటర్జీ పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు మిఠాయి తినిపించి ప్రత్యేక శుభాకాంక్షలు అందించినారు అనంతరం ఆయన మాట్లాడుతూ సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి సాయి వినయ్ కుమార్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తూ చాలా చిన్న ఉద్యోగి అయినప్పటికీ గత 16 సంవత్సరాలుగా ఎన్నో ఆదర్శనీయమైన సేవా కార్యక్రమాలు వేళల్లో నిర్వహించి లక్షల మంది పిల్లలకు పెద్దలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్న పిల్లలకు వైద్య విద్య నిమిత్తం ఖర్చులకు సంస్థ ముందు గాని ఇతర సంస్థ నుండి కానీ దాతలు లేనప్పటికీ ఎన్నో గట్టు పరిస్థితుల్లో కూడా ఒక బాధ్యతతో అందరూ తన తోటి వాళ్ళుగా భావిస్తూ పిల్లలందరి చేత వినయ్ అన్నయ్యగా పిలిపించుకుంటూ పేద విద్యార్థిని విద్యార్థుల కుటుంబాలలో పెద్ద కుమారుడిగా వారందరికీ చదువుకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ సుమారు 100 మందికి పైగా కార్యాలయంలో చదువుకు తగ్గ పరికరాలు సహాయంగా అందిస్తున్నారు . ఇది కాకుండా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పిల్లలు సుమారు 300 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు ఇలా ఆయన సేవలు చెప్పుకుంటూ పోతే ఎవరూ చేయలేని విధంగా వినయ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి పేద విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తుకు గొప్ప మార్గదర్శిగా మారారు అని ప్రశంసలతో సంస్థ సభ్యులను, వ్యవస్థప కార్యదర్శిని ప్రశంసించారు అదేవిధంగా దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి సంస్థకు మీ పూర్తి సహాయ సహకారాలు అందించటం ద్వారా మరి ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో ఆశాదీపం గా సంస్థ ఉండాలని పేర్కొన్నారు. అనంతరం ప్రజా వైద్యశాల డాక్టర్ శ్రావణ్ కుమార్ విద్యార్థులకు స్నేహం పట్ల చుట్టూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ విధంగా గమనించాలో తెలియపరచి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై శ్రద్ధ కొనసాగిస్తూ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వినియోగించుకొని మీరు కూడా పదిమందికి ఆదర్శంగా నిలవాలని వారిని ఆశీర్వదిస్తూ శాలువాతో టీచర్ జయలక్ష్మి మరియు పదో తరగతి ఇంటర్ ఉత్తమ ఫలితాలు అందుకున్న విద్యార్థినీ విద్యార్థులకు చిరు సత్కారం అందించినారు. ఈ కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ బీసీ సంక్షేమ నాయకుడు పట్టణాల హరిబాబు, సభ్యులు లోవరాజు, నరపత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.