

జనం న్యూస్ ఏప్రిల్ 27(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ )వేసవిలో రైతులు పశువులను మేతకు వదలడం వల్ల అవి రోడ్డు మీదకు రావడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని మునగాల సిఐ రామకృష్ణ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మునగాల మండల కేంద్రంలో ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ.. రాత్రి సమయంలో పశువులు రోడ్డు మీదకు రావడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని, రైతులు ఎవరి గేదెలను వారు ఇంటి దగ్గరే మేపుకోవాలని సూచించారు. సాగర్ కెనాల్ వెంట ఉన్న రైతులు తమ వ్యవసాయ మోటర్లు, పొలాల్లో బావుల దగ్గర ఉన్న మోటార్లను వ్యవసాయ పనిముట్లను జాగ్రత్త పరచుకోవాలని, రైతుల పొలాలు పూర్తయిన వెంటనే మోటార్లు, వైర్లను తీసుకొని ఇంటి దగ్గర జాగ్రత్త పరుచుకోవాలన్నారు, లేనిచో వాటిని దొంగలు దొంగలించే అవకాశం ఉందని, వ్యవసాయ కరెంటు ట్రాన్స్ఫార్మర్లు వైర్లు ప్రమాదవశాత్తు గాలి దుమారాలకు తెగి పశువులకు, మరేదైనా జీవాలకు తగిలి మరణించే అవకాశం కలదు. కనుక వ్యవసాయ కరెంటు ట్రాన్స్ఫార్మర్లు బందు చేయవలెనని తెలిపారు.