Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 27 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) దౌల్తాబాద్ మండల స్థాయిలో అంగన్వాడీ మరియు పూర్వ ప్రాథమిక పాఠశాల ప్రీస్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు .ఇట్టి కార్యక్రమంలో భాగంగా పిల్లలకు ప్రీస్కూల్ మెటీరియల్ ప్రదర్శిస్తూ ఆటలు, పాటలు కార్యక్రమాలను పిల్లల తల్లిదండ్రుల ఆధ్వర్యంలో నిర్వహించడం ద్వారా తల్లిదండ్రులకు చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు.అలాగే స్కూల్ పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వడం జరిగింది.పిల్లల తల్లి దండ్రులు పిల్లల ఆటలు, పాటలు, నాటకీయ ప్రదర్శన లు చూసి చాల మురిసిపోయారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఈ విధముగా పిల్లల మానసిక,శారీరక ఎదుగుదల ఆక్టివిటీ లు అంగన్వాడీ సెంటర్ లలో చేయడం చాలా సంతోషకరం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో చంద్రశేఖర్ , సిడిపిఓ ఎల్లయ్య ఎంపీడీవో వెంకట లక్ష్మమ్మ , మెడికల్ ఆఫీసర్ నాగరాజు రిలయన్స్ డిస్టిక్ కోఆర్డినేటర్ రాజలింగం ,పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ వెంకటప్రసాద్ ,బ్లాక్ కోఆర్డినేటర్ శ్యాంసన్ ,రిలయన్స్ ఫౌండేషన్ బ్లాక్ కో ఆర్డినేటర్ భాస్కర్ సరిత ,నాగరాజు జిల్లా మహిళా సాధికారిక సంస్థ , దౌల్తాబాద్ మండలం సూపర్ వైజార్ గిరిజ ,చంద్రకళ ,అంతుల్ రేణుక,స్వరూప,రాజేశ్వరి,హెల్త్ సూపర్ వైజర్ గీత భవని,లబ్దిదారులు ,పిల్లలు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.