Listen to this article

జనం న్యూస్ 27 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల బండి కుమారస్వామి రిపోర్టర్.)

ఎల్కతుర్తి మండలం జిలుగుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు తౌటం నరేందర్ ఆధ్వర్యంలో జిలుగుల గ్రామానికి చెందిన రావుల రాజు తండ్రి. సత్యయ్య లకు సీఎం సహాయ నిధి నుండి 40. వేల రూపాయల మంజూరైన చెక్కును రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు అందజేశారు. గ్రామ శాఖ అధ్యక్షులు మాట్లాడుతూ. బిపిఎల్ కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తించని సర్జరీలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి అమౌంటు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంవత్సరంలోనే రికార్డు స్థాయిలో ఎనిమిది వందల 30 కోట్ల సీఎం ఆర్ ఎఫ్ సహాయాన్ని విడుదల చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గూటం జోగి రెడ్డి, రావుల రమేష్, మాజీ ఉప సర్పంచులు తంగెళ్ల ప్రవీణ్ కుమార్, ముచ్చ బుచ్చిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఎర్రయ్య, సమ్మిరెడ్డి, పల్లె రాజయ్య, మనోహర్, ఓదెలు, ప్రభాకర్, రామ్, తదితరులు పాల్గొన్నారు.