


ఎస్ఐ ఉపేందర్, కానిస్టేబుల్ సంపత్ కు నగదు రివార్డ్
జనం న్యూస్, ఏప్రిల్ 28, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి
విధి నిర్వహణ లో ఉత్తమ సేవలకు అత్యుత్తమ పురస్కారం లభించింది. గంజాయి కేసులో నిందితుడు ఎస్ఆర్ఎస్ పి కెనాల్ లో దూకి పారిపోతుండగా ప్రాణాలకు తెగించి కెనాల్ లో దూకి నిందితుడిని పట్టుకొని గంజాయిని స్వాధీనం చేసుకున్న రామగుండం కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఎస్సై యు. ఉపేందర్ కు రాష్ట్ర డిజిపి జితేందర్ నగదు రివార్డు అందజేశారు. శనివారం హైదరాబాదులోని డిజిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఉపేందర్, కానిస్టేబుల్ సంపత్ లకు నగదు రివార్డ్ అందజేశారు. విధి నిర్వహణలో నిందితుడిని ప్రాణాలకు తెగించి పట్టుకున్నందుకు డిజిపి జితేందర్ తో పాటు నార్కోటిక్స్ ఏడిజి సందీప్ శాండిల్య లు ఎస్సై ఉపేందర్ ను ప్రత్యేకంగా అభినందించారు. రివార్డ్ లు అందుకున్న టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఉపేందర్, కానిస్టేబుల్ సంపత్ లకు రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీజీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, ఏడిజి పర్సనల్ అనిల్, నార్కోటిక్స్ ఎస్పీ చెన్నూరి రూపేష్ తోపాటు పలువురు పాల్గొన్నారు.