

(జనం న్యూస్ ఏప్రిల్ 28. చంటి )
దౌల్తాబాద్ మండలం పరిషత్ ప్రాథమిక పాఠశాల గాజులపల్లి లో వేసవి శిక్షణ శిబిరం కొనసాగుతుంది ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు నర్సింలు మాట్లాడుతూ విద్యార్థులకు సెలవుల్లో కూడా వేసవి శిక్షణ శిబిరం పెట్టి గణితం ఆంగ్లం చిత్రలేఖనం పాటలు మొదలైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు ఆనందంగా పాల్గొంటున్నారు. ఇట్టి కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్య పెరగాలని జిల్లా విద్యాధికారి ఆదేశాల మేరకు మండల విద్యాధికారి ఆదేశాల మేరకు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు రజిత సిఆర్పి రాజు విద్యా వాలంటీర్ రోజా పాల్గొన్నారు
