

జనం న్యూస్ 28 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
పోరాటాలతో కార్మికుల సమస్యలు పరిష్కరించడమే AITUC ప్రధాన లక్ష్యమని ఆ శాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. పట్టణంలోని చిన్న వీధిలో పలువురు ఫర్నిచర్ కార్మికులు ఏఐటీయూసీలో ఆదివారం చేరారు. పోరాటాలతో సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామని అశోక్ స్పష్టం చేశారు. హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ తమతో కలిసి రావాలన్నారు.