Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 28 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి దివంగత ఎం సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్) వర్ధంతి వేడుకలు జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఇ సందర్బంగా వారు మాట్లాడుతూ..1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించారు అన్నారు. 1971 లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా వరుసగా మూడు పర్యాయాలు గెలిచారాని తెలిపారు. 1983 వరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న 85 నుండి 88 వరకు సుప్రీంకోర్టు లో సీనియర్ కౌన్సిల్ గా పని చేశారన్నారు. 1990 నుండి 94 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు, అని ఇలా వారు ఎన్నో పదవులను అధిరోహించి జిల్లాలో అటు రాష్ట్రంలో దేశ రాజకీయాలు కీలకపాత్ర వహించిన ఉద్దండోడు, ఎమ్మెస్సార్ అని చెప్పక తప్పదు అని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎర్రం సతీష్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ గూడెం సారంగపాణి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశ్వరరావు, లింగారావు, రామకృష్ణ , చిన్నింటి నాగేంద్ర, అశోక్, పాతకాల ప్రవీణ్ తో పాటు మురళీ తదితరులు పాల్గొన్నారు.