Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 28 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలం


ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిరుపేదలకు, ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇచ్చే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని బహుజన సంక్షేమ సంఘం (బి ఎస్ ఎస్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మొగ్గం సుమన్ ఎంపీడీవో పణీ చంద్ర కు వినతిపత్రం ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ శాయంపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అర్హులకు అన్యాయం చేసే కుట్ర జరుగుతుందని అన్నారు. చాలామంది ఇల్లు లేని అభాగ్యులు సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఎదురుచూస్తున్నారని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఎంతైనా ఉందని తెలిపారు. అధికారులు ప్రజాప్రతినిధులు ప్రతి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఎంతమంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో, గుర్తించి మొదటి విడతలో వారికి మాత్రమే ఇల్లు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇల్లు వస్తాయని ఎంతో ఎదురు చూశారు కానీ ఎలాంటి ఉపయోగం లేదని నిరాశ చెందారని వాపోయారు. నిలువ నీడలేని నిరుపేద ప్రజలు సొంత ఇల్లు లేక ఇతర ఇళ్లల్లో అద్దెకు ఉంటూ కష్టపడుతూ జీవనం కొనసాగిస్తున్నారని, కొంతమంది సొంత ఇల్లు లేక వేరే ప్రాంతాలకు వలస వెళ్లి పని చేసుకుంటూ జీవిస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఉన్నవాడికి ఇల్లు ఇవ్వకుండా లేని వారిని గుర్తించి వారికి సొంత ఇంటి నిర్మాణం సాకారం చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల పేద ప్రజలను, సబ్బండ వర్గాలను,దళిత బహుజన వివిధ ప్రజా సంఘాలను, ఏకం చేసుకొని ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తామని తెలియజేశారు….