

జనం న్యూస్;28 ఏప్రిల్ సోమవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ :
పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని యాదవ విద్యావంతుల వేదిక సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవత్వం లేకుండా మనిషిని మనిషి చంపుకోవడం ఎంతవరకు న్యాయమని, ఉగ్రవాదులను టెర్రరిస్టులను దేశం నుండి తరుమాలన్నారు. ఇట్టి కార్యక్రమంలో యాదవ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు గొర్రె మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి ఉండ్రాళ్ళ రాజేశం, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య, టౌన్ అధ్యక్షులు పయ్యావుల ఎల్లం, దాసరి శ్రీనివాస్, బాల్ నర్సయ్య, రాములు, బాలమల్లు, చంద్రశేఖర్, యాదగిరి, అనిల్ కుమార్, నర్సింలు, గంధం రాజు, బొల్లు రాము తదితరులు పాల్గొన్నారు.