Listen to this article

305 ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులకు సమ్మర్ క్యాంపు

సమ్మర్ క్యాంపుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు పూర్తిగా ఉచితం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో సమ్మర్ క్యాంపు నిర్వహణ

ఉల్లాసవంతంగా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తూ ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పన

సమ్మర్ క్యాంప్ నిర్వహణ పై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్

జనం న్యూస్, ఏప్రిల్ 29, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం మే 1 నుంచి జూన్ 10 వరకు ఉచితంగా సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేసవి సెలవులలో జిల్లాలోని అన్ని గ్రామాలలో 1 నుంచి 7వ తరగతి చదివే విద్యార్థుల కోసం 400 మంది వాలంటీర్లతో 305 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గం.వరకు సమ్మర్ క్యాంప్ ఉంటుందని అన్నారు. ఈ సమ్మర్ క్యాంపుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదని, పూర్తిగా ఉచితంగా నిర్వహిస్తున్నామని, జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఈ సమ్మర్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని, వాలంటీర్లు విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి కలిగే విధంగా గైడేన్స్ ఇస్తారని , సమ్మర్ క్యాంపులో అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పిల్లలపై మంచి ప్రభావం పడే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. విద్యార్థులకు గొప్ప లక్ష్యాలను ఏర్పరచు కోవడం నేర్పాలని, సమ్మర్ క్యాంపు ఉల్లాస వంతంగా నిర్వహిస్తూ జీవితానికి అవసరమైన ముఖ్య పాఠాలను బోధించడం, క్రీడలు, నీతి కథలు చెప్పడం, చదువు ప్రాముఖ్యత వివరించడం, విలువలు, మోరల్స్ బోధిస్తామని కలెక్టర్ తెలిపారు. సమ్మర్ లో జరిగే సమ్మర్ క్యాంపు ను 1 నుంచి 7వ తరగతి చదివే విద్యార్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా సమ్మర్ క్యాంప్ కు పంపాలని, వాలంటీర్లకు గౌరవ వేతనం కూడా ఇవ్వడం జరుగుతుందని ఈ సమ్మర్ క్యాంప్ ను అందరూ వినియోగించుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.