

జనం న్యూస్ ఏప్రిల్ 28 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని జానకపూర్ లో ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో 139,వ మే డే పోస్టర్ ఆవిష్కరణ.
139వ “మే డే” స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ల రద్దు కై పోరాడుదామని పోస్టర్ విడుదల సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఐ ఎఫ్ టీ యురాష్ట్ర నాయకులు ఎండీ. చాంద్ పాషా, కార్మిక లోకానికి పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా ఐ ఎఫ్ టీ యురాష్ట్ర నాయకులు Md. చాంద్ పాషా మాట్లాడుతూ…….* కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత నరేంద్ర మోడీ ప్రభుత్వం విస్మరించడం శోచనీయమని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం కార్పోరేట్ అధిపతులు అంబానీ,ఆదానీ లకు ప్రజా సంపదను కట్టబెట్టెందుకే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి కార్మిక వర్గానికి మరణశాసనం విధించారని ఆయన అన్నారు. అన్నదాత రైతన్న అంటూ భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠం ఎక్కిస్తున్న నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలను నిర సించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను, అన్యాయాన్ని ప్రశ్నిస్తే, కార్మికుల్ని, నిర్బంధిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర సర్కార్ ఫాసిస్ట్ పాలన కొనసాగిస్తూ,ఎమర్జెన్సీని మరిపిస్తోందని ఆయన అన్నారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేయడం ఆపి, రక్షించాలని, ఆయన డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.139,వ మేడే సందర్భంగా ఐఎఫ్టియు జాతీయ కమిటీ ప్రత్యేకంగా పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఐక్యతను విచ్చిన్నం చేస్తూ, లౌకిక విలువలను పాతరేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని ఆయన అన్నారు. దేశంలోని కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్ఐ చట్టాలను అమలు చేయాలని ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.స్వచ్ భారత్ లో అగ్ర భాగాన ఉన్న గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధి కేటాయించి, ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, సిర్పూర్ కాగజనగర్ జెకే పేపర్ మిల్లులో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, పర్మినెంట్ కార్మికుల వేతన ఒప్పదం అమలు చేయాలి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని లేదా కేంద్ర ప్రభుత్వం జీవన భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చికాగో అమరవీరుల అమరత్వం స్ఫూర్తితో గ్రామ గ్రామా ణ మేడే సభలు నిర్వహించి, కార్మిక ఉద్యమానికి సమర శంఖం పూరించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఐ ఎఫ్ టీ యు రాష్ట్ర నాయకులు టి. శ్రీనివాస్, జిల్లా నాయకులు బండారి తిరుపతి, పిడిఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి జగజంపుల తిరుపతి, నాయకులు బాబా, వీరన్న, రవీందర్, అఖిల్, సమీర్, రమేష్, షేక్ బాబ*తదితరులుపాల్గొన్నారు.