

– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 18 జనవరి
విజయనగరం టౌన్ రిపోర్టర్
గోపికృష్ణ పట్నాయక్
స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు ప్రాధమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు
పి.ఎం.టి. మరియు పి.ఈ.టి. పరీక్షల ప్రక్రియ కొనసాగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 17న తెలిపారు.
జనవరి 17న నిర్వహించిన 12వ రోజు పి.ఎం.టి. మరియ పి.ఈ.టి. పరీక్షలకు 600 మంది పురుష అభ్యర్ధులు
హాజరుకావాల్సి ఉండగా, 475 అభ్యర్థులు మాత్రమే పి.ఎం.టి./పి.ఈ.టి. పరీక్షలకు హాజరయ్యారని, వారిలో 373మంది
అభ్యర్ధులు తుది రాత పరీక్షకు అర్హత సాధించారన్నారు. నియామకాల ప్రక్రియ వేకువ జామున 5గంటల నుండే
ప్రారంభం కావడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో, పి.ఎం.టి. మరియుపి.ఈ.టి. పరీక్షలు సకాలంలో పూర్తయ్యా
యన్నారు. పోలీసు నియామకాల ప్రక్రియను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపుఎస్పీజి.నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు.అభ్యర్ధులకు ముందుగా హాల్ టిక్కెట్స్ను పరిశీలించి, పోలీసు పరేడ్ గ్రౌండులోకి అనుమతించారు. అనంతరం,అభ్యర్ధుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిర్ధారించే ధృవ పత్రాలను పరిశీలించి, అన్ని సర్టిఫికేట్స్ సక్రమంగా ఉన్నఅభ్యర్ధులకు మాత్రమే బయోమెట్రిక్ తీసుకొని, పి.ఎం.టి. పరీక్షలకు అనుమతించామన్నారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన డిజిటల్ ఇక్విప్మెంట్స్ వినియోగించి, అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలను నిర్ధారించి, అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఈ.టి. పరీక్షలను అనుమతించామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.ఈ నియామక ప్రక్రియలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డిఎస్పీలు ఎం.వీరకుమార్, యూనివర్స్, పి.వి.రమణమూర్తి, ఎస్.రాఘవులు, కే.థామస్ రెడ్డి, ఎఓ పి.శ్రీనివాసరావు, పలువురు సిఐలు, రిజర్వు ఇన్సెపెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పీఈటీలు మరియు ఇతర పోలీసు అధికారులు, పోలీసు కార్యాలయఉద్యోగులు పాల్గొని, ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగే విధంగా విధులు నిర్వహించారు.