Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 30 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)


అక్షయ తృతీయ పండుగ సందర్భంగా శ్రీ వాసవి కిట్టి టీం మహిళలచే శక్తి స్వరూపిణి గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అక్షయ తృతీయ పూట శీతల పానీయం దానం చేయడం చాలా పుణ్యప్రదం అనే సంకల్పంతో వాసవి కిట్టి టీం మహిళలు శ్రీ మావుళ్ళమ్మ తల్లి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో ఆణి విళ్ళ వెంకట్రమణ సేవా ట్రస్ట్ తరఫున ఏర్పాటు చేసిన చలివేంద్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాహార్తులకు మజ్జిగ నివ్వడం జరిగింది.
గ్రామ శ్రేయస్సు కొరకు మహిళలంతా కలిసి ఈ కార్యక్రమాన్ని సామూహికంగా నిర్వహించి ఉన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఫణికాంత్ శాస్త్రి,, ప్రధాన ఆశాది మందపల్లి మహేష్, వీర పండు, అధ్యక్షులు సాయిబాబా, రామకృష్ణ పరమహంస తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా దాతల సహాయ సహకారాలతోటి చలివేంద్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈనెల మే ఆరో తారీకు మంగళవారం నాడు శ్రీ మావుళ్ళమ్మ తల్లి తీర్థ మహోత్సవం. .