Listen to this article

ప్రాపర్టీ సంబంధిత నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

జనం న్యూస్,మే 01, పెద్దపల్లి జిల్లా ప్రతినిధి

నెలవారి సమీక్షాలో భాగంగా రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ఈరోజు కమిషనరేట్‌ కార్యాలయములో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. డిసిపి లు, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ఎసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు పాల్గోన్న ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా పోలీస్‌ స్టేషన్‌, డివిజిన్, జోన్లవారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రామగుండము పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో నమోదైన గ్రేవ్‌ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, పోక్సో కేసులు, మిస్సింగ్‌, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందని మొదలైన అంశాలపై పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ స్టేషన్‌ వారిగా పోలీస్‌ అధికారులతో సమీక్షా జరిపారు. అదేవిదంగా నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులతో చర్చించడం జరిగింది. సిపి మాట్లాడుతూ … రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గించి ప్రజల ప్రాణాలు కాపాడుటకు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ విభాగంతో కల్సి పనిచేయాలని, ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషణ చేసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో విలేజ్, టౌన్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలి అని అధికారులను ఆదేశించారు. రాత్రి సమయాల్లో ప్రజలు మనపై వున్న నమ్మకానికి తగ్గట్లుగా దొంగతనాలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుంటూ, విజబుల్ పోలిసింగ్, పెట్రోలింగ్‌ ముమ్మరం చేసి చోరీలను నియంత్రించాలని, ప్రధాన చోరీలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంతో పాటు దొంగతనాలను కట్టడి చేసేందుకు చోరీ కేసుల్లో శిక్ష అనుభవించి జైలునుండి బయటకు వచ్చే దొంగలపై నిఘా పెట్టాలని సూచించారు పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు చట్టలకు లోబడి బాధితులకు సత్వరమే న్యాయం అందించాలని, అదే విధంగా నమోదైన కేసులలో పారదర్శకంగా విచారణ జరిపి నిందితులకు శిక్షపడేలా చూసి బాధితులకు పోలీస్ పై నమ్మకం, భరోసా కలిగించే విధంగా విధులు నిర్వహించాలన్నారు. నూతన చట్టాల ప్రకారం, సి సి టి ఎన్ ఎస్ 2.ఓ లో భాగంగా నేరాల విచారణ దర్యాప్తు మరియు నిరూపణ లో ప్రజలకు బాధితులకు పోలీసులపై నమ్మకం భరోసా కలిగించే విధంగా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో భాగంగా గౌరవ కోర్ట్ నుండి ఇ- సమాన్స్ సి సి టి ఎన్ ఎస్ అప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో నేరుగా పోలీస్ స్టేషన్ కి పంపించడం జరుగుతుంది. అట్టి ఈ సమాన్స్ డౌన్లోడ్ చేసుకొని ఫిర్యాదుదారునికి, నిందితులకు సాక్షులకు సర్వ్ చేయడం జరుగుతుంది తర్వాత వారి కి సర్వ్ చేసిన అక్నాలజిమెంట్ ను మరల ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ఇట్టి పూర్తి ప్రక్రియ ఈ కోర్టు అప్లికేషన్లో కోర్టు సంబంధిత అధికారులకు ఆన్లైన్లో కనిపించడం జరుగుతుంది. ఇట్టి ప్రక్రియను ఎప్పటికీ అప్పుడు సి సి టి ఎన్ ఎస్ లో అప్లోడ్ చేయాలని సిపి సూచించారు. అదేవిదంగా ఇ -సైన్ ద్వారా ఫిర్యాదు దారుని దరఖాస్తు ఆధారంగా ఎఫ్ ఆర్ ఐ చేసిన వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ సంబంధించిన డిజిటల్ సంతకం తో ఫిర్యాదుదారునికి ఎఫ్ఐఆర్ లింక్ వెళ్లడం జరుగుతుంది. ఈ- సాక్ష్య ద్వారా విచారణ, దర్యాప్తు సమయంలో లభించిన భౌతిక సాక్షాలు ను ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ద్వారా సేకరించి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సాక్ష్యం లో అప్లోడ్ చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు ఇబ్బంది జరగకుండా నిందితులకు శిక్ష పడే అవకాశం ఉంటుందని తెలిపారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే శాఖ పరమైన చర్యలు తప్పవు అన్నారు. గంజాయి నియంత్రణకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రవాణా చేసే వారిని గుర్తించాలి కేసులు నమోదు చేయాలి, గంజాయి సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలనీ ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపిఎస్., పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ఏ సి పి, పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, బెల్లంపల్లి ఏసీపీ రవి కుమార్ ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, ఏసిపి మల్లారెడ్డి, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, సీఐ లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.