Listen to this article

జనం న్యూస్,జనవరి 18,కంగ్టి

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలోని స్థానిక తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో శనివారం పీఎం జీవన్ జ్యోతి భీమ చెక్కులను తడ్కల్ భగవాన్ కనీషా బేగం సలీం,తడ్కల్ కుమ్మరి సుమలత జ్ఞానేశ్వర్,డోంగ్ బాన్సువాడ గైని పుల్లవ పోచయ్య,చాప్ట బి జాదవ్ యశోద శివరాం,ముర్కుంజల్ గుడిపల్లి సునంద బాల్ రెడ్డి,లను బ్యాంకు మేనేజర్ కె మహేందర్, చేతులమీదుగా చెక్కులను అందించడం జరిగింది.ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూప్రధానమంత్రి జీవన జ్యోతి బీమాయోజన భారత ప్రభుత్వ జీవిత బీమాపథకం అని అన్నారు.ఈ పథకం వాస్తవంగా 2015 ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చే బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించబడింది.ఇది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చే 2015 మే 9 న కోల్‌కతాలో ప్రారంభించబడింది. 2015 మే వరకు భారత జనాభాలో 20 శాతం మంది మాత్రమే ఏదో ఒక జీవిత బీమాపాలసీని కలిగి ఉన్నారని అన్నారు.ఈ పథకం ద్వారా పాలసీదారుల సంఖ్యను పెంచడమే దీని ఉద్దేశం అని అన్నారు.(పి ఎం జె జె బి వై) 18 నుంచి 50 సంవత్సరాల వయసుగలిగి బ్యాంకు ఖాతా ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.ఈ పథకంలో సంవత్సరానికి 330 రూపాయలు చెల్లించాలి.దీనికి జిఎస్టి ఉండదు.ఈ సొమ్ము నేరుగా ఖాతాల నుంచే తీసుకుంటారు.ఒకవేళ ఖాతాదారుకు ఏదైనా జరిగితే నామినీకి 2 లక్షల రూపాయలు చెందిస్తారని అన్నారు. ఖాతాదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే తమ బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా తమ ఆధార సంఖ్యతో అనుసంధానం చేసుకోవాలని అన్నారు.ఈ పథకం ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద తెరిచిన బ్యాంకు ఖాతాలకు వర్తిస్తుందని అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఖాతా దారులందరూ ఈ బీమా ని నమోదు చేసుకొని తమ కుటుంబాన్ని ఆర్థికపరంగా ఇబ్బందులు రాకుండా కాపాడుకున్న వారవుతారని ఖాతాదారులకు విన్నవించారు