Listen to this article

ఏర్గట్ల హై స్కూల్ బాలికలే మొదటి రెండు స్థానాలు కైవసం


జనం న్యూస్ ఏప్రిల్ 30:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండల

కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన 67 మంది బాలురు, 56 మంది బాలికల నుంచి 1 బాలుడు పరీక్ష రాయలేక పోవడంతో, మొత్తం 122మంది నుంచి 65మంది బాలురు , 56 మంది బాలికలు మొత్తం 121 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా ఒక విద్యార్థి అనుత్తీర్ణత పొందడని మండల విద్యాధి కారి ఆనంద్ రావు తెలిపారు. 500 పైన మార్కులు సాధించిన వారిలో ఏర్గట్ల జడ్పి ఉన్నత పాఠశాలకు చెందిన ఐదుగురు బాలికలు, ఐదుగురు బాలూరులు, గుమ్మర్యాల్ జడ్పి ఉన్నత పాఠశాలలో నల్గురు బాలికలు, తొర్తి ఉన్నత పాఠశాల లో ముగ్గురు బాలూరులు, ఒక బాలిక, తాళ్ల రాంపూర్ ఉన్నత పాఠశాలలో ఒక బాలిక, తడపాకల్ ఉన్నత పాఠశాల లో నల్గురు బాలురు, ముగ్గురు బాలికలు, ఏర్గట్ల కే జీ బీ వీ పాఠశాలలో 23 మంది బాలికల్లో 15మంది బాలికలు ఐదు వందల పైన మార్కులు సాధించి సత్తా చాటరు.మండల వ్యాప్తంగా విద్యార్థులు 99.18 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఏం ఈ వో తెలిపారు.