

జనం న్యూస్ జనవరి(18) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం లక్ష్మాపురం ఎస్సారెస్పీ 70 డిబిఎం కాల్వకు నీళ్లు అందించాలని శనివారం నాడు మండల పరిధిలోని రైతులు ఎస్సారెస్పీ కాల్వకు పరమతులు చేయించి చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందించాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు అందకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి అంటూ రైతులు మొరపెట్టుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే సామేలు తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినారు. ప్రభుత్వం స్పందించి తమకు వెంటనే నీళ్లు అందించాలని కోరారు.