Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 02 మే, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లాలో అనధికారంగా మందుగుండు సామగ్రిని తయారీ, నిల్వలు, విక్రయాలు జరిపే వారిపై దాడులను విస్తృతం చేయాలని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మే 1న ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్ మాట్లాడుతూ – జిల్లా వ్యాప్తంగా అనధికారంగా మందుగుండు తయారీ, నిల్వలు, విక్రయాలు నిర్వహించే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా జిల్లాలో లైసెన్సులు కలిగి మందుగుండు సామగ్రి నిల్వలు, విక్రయాలు జరిపే గోడౌన్లు, షాపుల్లో భద్రత ప్రమాణాలు, నిబంధనలు పాటిస్తున్నది, రక్షణ చర్యలు చేపడుతున్నది లేనిది పరిశీలించి, నివేదికలను
అందజేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. జిల్లాలో మందుగుండు నిల్వలు, విక్రయాలు చేపట్టేందుకు సంబంధిత అధికారులు జారీ చేసిన లైసెన్సులను, రికార్డులను పరిశీలించాలన్నారు. లైసెన్సులు కలిగిన షాపులు, గోడౌన్లును సంబంధిత పోలీసు అధికారులు సందర్శించి, సంబంధిత గోడౌన్లు, షాపుల్లో భద్రత ప్రమాణాలు, నిబంధనలు పాటించే విధంగా చూడాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా షాపుల యజమానులు చేపట్టిన రక్షణ చర్యలను పరిశీలించాలన్నారు. మందుగుండు నిల్వ చేసే గోడౌన్లు, షాపుల్లో స్మోకింగు అలారమ్స్ ను ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని ప్రమాదాల నుండి సురక్షితంగా బయట పడేందుకు కనీసం రెండు అత్యవసర మార్గాలు ఉండే విధంగా చూడాలన్నారు.అంతేకాకుండా, అగ్ని ప్రమాదాలు జరిగేందుకు అవకాశం ఉన్న వస్తువులను గోడౌన్లు, షాపుల్లోకి అనుమతించకుండా
చర్యలు చేపట్టాలన్నారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే అగ్నిని నియంత్రించేందుకు ఫైర్ ఫైటింగు పరికరాలు అందుబాటులో ఉండే విధంగా షాపు యజమానులు చూడాలన్నారు. అగ్ని ప్రమాదాల నుండి రక్షించు కోవడానికి బకెట్లు, ఇసుక, నీరు కార్బన్ డయాక్సైడ్ వంటి అగ్ని నిరోదించే పరికరాలు, వస్తువులు మందుగుండు షాపులు, గోడౌన్లుకు అందుబాటులో ఉంచాలన్నారు. అదే విధంగా ఎటువంటి అనుమతులు లేకుండా రహస్యంగా మందుగుండు తయారీ, విక్రయాలు, నిల్వలు చేసే వ్యక్తుల సమాచారంను సేకరించాలని, దాడులు నిర్వహించి, వారిపై చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు. గ్రామ స్థాయిలో సమాచార వ్యవస్థలను ఏర్పాటు చేసుకొని, సమాచారం
సేకరించి, మందు గుండును అనధికార విక్రయాలు, తయారీ, నిల్వలు జరిపే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు నిర్వహించే తనిఖీలను సంబంధిత డిఎస్పీలు పర్యవేక్షించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు.