

జనంన్యూస్. 03. సిరికొండ. ప్రతినిధి.
విప్లవోద్యమ పోరాట యోధుడు కామ్రేడ్ ములుగు. రాజేందర్
సీపీఐ(ఎంఎల్.)మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పిలుపు అమరుడు రాజేందర్ పోరాట స్పూర్తితో బలమైన విప్లవోధ్యమాలను నిర్మిద్దామని, విప్లవోద్యమ పోరాట యోధుడు కామ్రేడ్ ములుగు. రాజేందర్ అని .సీపీఐ(ఎంఎల్.)మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ పేర్కొన్నారు శనివారం నాడు సిరికొండ మండల కేంద్రంలో ఉపాధి కూలీలతో సీపీఐ(ఎంఎల్.) మాస్ లైన్ (ప్రజాపంథా) ఆధ్వర్యంలో కామ్రేడ్. మూలుగు. రాజేందర్ 4వ, వర్ధంతిని. నిర్వహించారు.ఈ సందర్బంగా సీపీఐ(ఎంఎల్.)మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ మాట్లాడుతు.
విప్లవోద్యమ యువకిషోరం కామ్రేడ్ ములుగు. రాజేందర్. నమ్మిన రాజకీయాల కోసం చివరిదాకా నిలబడ్డ నికర్సైన ఉద్యమ నేత అన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చిన నమ్మిన రాజకీయాలకోసం మరణం వరకు నడిచిన కమ్యూనిస్ట్ నాయకుడన్నారు. దోపిడి రాజ్యం పోవాలని, శ్రమజీవుల రాజ్యం రావాలని జీవితాంతం కష్టజీవుల కోసం పనిచేసిన ఉద్యమ నాయకుడన్నారు. పేద ఇంట్లో పుట్టి పేదల కోసమే పనిచేయాలని పట్టుదలతో ముందుకెళ్లిన విప్లవదీరుడని, చదువుకుంటున్నప్పటి నుండే విప్లవ రాజకీయాలవైపు అక్కర్సింపబడ్డాడన్నారు. ఆనాటి నుండి కార్మికరంగంలో ఆ తర్వాత వ్యవసాయ రంగంలో అంకిత భావంతో పనిచేశారని,ఆయన అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడ్డాడన్నారు.మొండి వాడిగా, దండివాడిగా ఉండేవాడు. ఎంతో ధైర్యంగా పేరూపొందాడు. సిరికొండ 532 సర్వే నెంబర్ భూమి పోరాటంకు పునాదిగా నిలబడ్డాడు. సిరికొండ, భీంగల్, ధర్పల్లి మండలాల్లో పార్టీ నిర్మాణంకు కీలకంగా నిలబడ్డాడు. కామ్రేడ్. మూలుగు. రాజేందర్ విప్లవపంథా, ప్రజాపంథా కోసం చివరి వరకు మొక్కవోని ధైర్యంతో పనిచేసారన్నారు. తను 03-05-2021 న మరణించారు. ఆయన మరణం విప్లవొద్యమానికి తీవ్రనష్టకరంన్నారు. కామ్రేడ్. మూలుగు. రాజేందర్ ను స్మరించుకోవడం అంటే బలమైన విప్లవొద్యమాలను నిర్మించడమేనన్నారు.ఈ వర్ధంతి సభకు సీపీఐ(ఎంఎల్.)మాస్ లైన్ (ప్రజాపంథా) మండల నాయకులు ఈ రమేష్ అధ్యక్షత వహించాగా, ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ మాట్లాడగా, డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, జి. సాయరెడ్డి, మండల నాయకులు బి. కిషోర్, ఎం. లింబాద్రి, ఎల్. నరేష్, ఎస్. గంగమల్లు, ఎల్. గోపి, ఎస్. కిశోర్, ఎం.డి. అనిస్, బి. నాగన్న, బి. సర్పంచ్, జి. బాల్ రెడ్డి, T. భూమాగౌడ్, ఎం. పండరి, ఎస్.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.