Listen to this article

జనం న్యూస్ 19 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జనం న్యూస్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా తుంగభద్ర సుంకేసుల రిజర్వాయర్ మరియు తుమ్మిళ్ళ ఎత్తిపోతల ప్రాజెక్ట్ నీటి ఇన్ ఫ్లో నీ పరిశీలించి…అలంపూర్ నియోజకవర్గంలోని అర్ డి సి ఆయకట్ట దారులు ఆర్డీఎస్ కు నీళ్లు ఎప్పుడు వస్తాయా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ గాని కర్ణాటక లో వర్షాభావ, ప సాంకేతిక మరియు పరిపాలన కారణాలవల్ల గాని నీళ్లు రాకపోవడం వల్ల అనేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి స్థానిక సుంకేసుల తుమ్మిళ్ల కి రావడం జరిగింది అనీ ఆవేదన వ్యక్తం చేశారు.వేలాది మంది రైతులు రైతుల యొక్క పంటలు నష్టపోకూడదు అని ఫోటోలకు ఫోజులు ఇచ్చే వారి మిడిమిడి జ్ఞానాన్ని బహిర్గతం చేసి రైతులకు న్యాయం తెలియజేయాలి వాస్తవాలు తెలియపరచడం ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగిందని అన్నారు.రైతులు లో ఉన్నటువంటి ఆందోళనలను అపోహలను తొలగించి వారిలో నమ్మకం కలిగించాలని ఆలోచనతో పత్రిక విలేకరులను పిలిచి వాస్తవ విషయాలను వివరించడం కోసం ఇక్కడికి రావడం జరిగింది అన్నారు.ఎందుకంటే వారం రోజుల క్రితము తుంగభద్ర కి ఇండెంట్ పెట్టడం జరిగింది. అన్నారు .5.86 టీఎంసీలకు ఎన్నింటి పెట్టడం జరిగింది నీళ్లు వస్తా ఉన్నాయి కానీ ఒక తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఎన్నింటితో ఆర్డీఎస్ రైతులు గడ్డకు పడే పరిస్థితి లేదు ఆయకట్టు రైతులకు న్యాయం జరిగే పరిస్థితి లేదు అన్నారు దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వం రెండు ఇండెంట్లు కలిసి పెడితేనే అప్పుడు రైతులకు న్యాయం జరిగే పరిస్థితి ఉందని తెలిసి మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి నాయకులు ఫోటోలు దిగి రైతులను అపోహ పెడుతున్న క్రమంలో వాస్తవాలు తెలియజేయాలని అటువంటి ఉద్దేశంతో ఈరోజు తుమ్మిళ్ల కి రావడం జరిగింది అన్నారు.రేవంత్ రెడ్డి నాయకత్వంలో భారత దేశంలో ఏనాడు లేని విధంగా ఒకే ఒక రాష్ట్రం ఒకే ఏడాదిలో అత్యధికంగా దిగుబడులు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కి రైతుల పట్ల ఎంత చిత్తశుద్ధి అనేది దాన్ని చూస్తే అర్థమవుతుంది అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రిఅపారమైనటువంటి అనుభవం గల ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడ మన ఇండెంట్ మరియు ఆంధ్ర ఇండెంట్ కలిపి పెట్టడం వల్ల మరొక వెయ్యి క్యూసెక్కుల నీటిని ఒక రోజుకు విడుదల చేసే విధంగా 1.5 టిఎంసిలను విడుదల చేసే విధంగా జీవో తీసుకురావడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రి గారిని మరియు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఈరోజు సరిపడినంత సాగు నీటి నీ రైతులకు అందించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇదే ప్రధాన సాక్ష్యం అన్నారు ఇండెంట్ పెట్టిన తర్వాత వచ్చే ఇన్ఫ్లో నుంచి కొన్ని క్యూసెక్కుల వాటర్ కేసీ కెనాల్ కి పోవడం వల్ల రెండు వేల క్యూసెక్కులు కేసీ కెనాల్ ద్వారా బయటకు పోవడం వల్ల మనకు సరైన న్యాయం జరగడం లేదు. కనుక కెసి కెనాల్ ఔట్ ఫ్లో నీ తగ్గించాలని ఆంధ్రా అధికారులని సంపత్ కుమార్ గారు కోరారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ సంపత్ కుమార్ వెంట టీపీసీసీ అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి ఆచారి,ఐజ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాస్టర్ మధు కుమార్ మరియు ఐజ పట్టణ కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది.