

జనం న్యూస్ 20 జనవరి 2025 విష్ణు వర్ధన్ గౌడ్ జిల్లా బ్యూరో ఇంచార్జీ జోగులాంబ గద్వాల్ జిల్లా పదేపదే రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవడం ప్రజలను మోసం చేయడమేబీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ప్రతి ఒక్కరికి నిష్పక్షపాతంగా రేషన్ కార్డులను జారీ చేయాలి అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు భయపడి సామాన్య ప్రజలకు అన్యాయంచేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ప్రతి ప్రభుత్వ పథక ఎంపికలో నిష్పక్షపాతంగా సర్వే చేయించి అందించాలి.రేవంత్ రెడ్డి సర్కార్ కి ప్రజలకు రేషన్ కార్డులు అందించే చిత్తశుద్ధి లేకనే పదేపదే దరఖాస్తులు తీసుకోవడం మోసపూరితమేఆరోజు ప్రజాపాలనలో తీసుకున్న దరఖాస్తుల ప్రకారమే ప్రతి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేయాలి.ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అధికార పార్టీ నాయకులు సామాన్య ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తూ మేము చెప్పినట్టు వింటేనే ఇండ్లు ఇస్తామని భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గం అని అన్నారు.కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరికి సమానంగా పథకాల అందించిన ఘనత కేసీఆర్ ది.