

జనం న్యూస్ 07మే పెగడపల్లి ప్రతినిధి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో మండల కేంద్రంలోని పిఎసిఎస్ వరి ధాన్య కొనుగోలు కేంద్రంలోపెగడపల్లి ఏఎంసీ చైర్మన్ బుర్ర రాములు గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు ఫ్యాక్సి సీఈఓ కి కొనుగోలను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే రైతులకు కొనుగోలు కేంద్రం లో త్రాగునీటి సౌకర్యంమరియు మూత్ర శాలలు సౌకర్యం కల్పించాలని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని
తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఏఎంసి డైరెక్టర్ విజయభాస్కర్ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఆకుల విష్ణు శ్యాంసుందర్ రెడ్డి స్థానిక రైతులు మరియు తదితరులు పాల్గొన్నారు.