Listen to this article

జనంన్యూస్. 06.సిరికొండ. ప్రతినిధి.

నూతన వ్యవసాయ మార్కెట్ బిల్లును రద్దు చేయాలని ఎం.ఎస్.పి గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని,
8న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ రైతు ధర్నా ను జయప్రదం చేయండి.అఖిల భారత ప్రగతిశీల ఐక్య రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి. బాబన్న పిలుపు. అఖిలభారత ఐక్యరైతుసంఘం రాష్ట్ర కమిటీ పిలుపు లో భాగంగా సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో రైతు సమస్య లను ప్రభుత్వం పరిష్కారం చేసి ఎంఎస్పి చట్టం చేయాలనీ, తాసిల్దార్ కు వినతి పత్రం. ఈ సందర్భంగా .బాబన్న మాట్లాడుతూ బడా పారిశ్రామికవేత్తలకు. కొమ్ము కాస్తూ రైతుల నడ్డి విడ్చడానికి తెచ్చిన 3 రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేస్తున్న అని రైతులకు రాతపూర్వకంగా రాసి ఇచ్చి. ఇప్పుడు పేరు మార్చి నూతన వ్యవసాయ మార్కెట్ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లును వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎం ఎస్ పి. గ్యారంటీ చట్టాన్ని అమలు చేయాలని. ఎన్.ఆర్.జి.ఎస్.పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 రోజులు పని కల్పించాలని. దినసరి కూలి 600 రూపాయలు ఇవ్వాలని. రాష్ట్ర ప్రభుత్వం హామీలో భాగంగా వ్యవసాయ కార్మికులకు 12000/- ఆత్మీయ భరోసా అమలు చేయాలని. దొడ్డు రకం ధాన్యానికి కూడా 500 బోనస్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.పై డిమాండ్స్ పైన ఈ నెల 8న చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే రైతు ధర్నాకు రైతులు పెద్ద ఎత్తున కడలి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సి పి ఐ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్. రైతు సంఘం జిల్లా నాయకులు.ఎం లింబన్న. నారా గౌడ్.ఇ. రమేష్.సాయి రెడ్డి.బి కిషోర్.స్ కిషోర్ ఎం డి అనీష్.బల్ రెడ్డి. భూమా గౌడ్.ఆశిష్.గోపి.పాల్గొన్నారు.