

జగన్ న్యూస్ మే 6 నడిగూడెం
మండల కేంద్రమైన నడిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 2006-2007 విద్యా సంవత్సరం లో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల సమ్మేళనం మంగళవారం జరిగింది. చదువు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. చాలాకాలం తర్వాత కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులంతా ఒకచోట కలుసుకొని గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ చింతలపాటి వాణి మాట్లాడుతూ పాఠశాలలో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగటం ఆనందంగా ఉందన్నారు. తమ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదిగేలా చదివించాలన్నారు. మంచిగా చదువుకొని పాఠశాలకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావడంతోపాటు మంచి స్థాయికి ఎదగటం వెనక తల్లిదండ్రుల గురువుల కృషి ఎంతో ఉందన్నారు. ప్రతి సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనము జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణ, రమణమ్మ, అనురాధ, కరుణాకర్ రెడ్డి, రాంబాబు, మూర్తి, కోటయ్య పూర్వ విద్యార్థులు త్రివేణి, కవిత, హరిప్రియ తదితరులు పాల్గొన్నారు.