

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 20 రిపోర్టర్ సలికినిడి నాగరాజు : డాక్టర్ కొల్లా రాజమోహనరావు, ఆయన సతీమణి ప్రారంభించారు.రేగు చెట్టు ఆసుపత్రిగా పేరు పొందుతున్న వైనం.డాక్టర్ అమర్ కు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం,ప్రజా సంఘాల నాయకులు ఘన సత్కారం.చిలకలూరిపేట: వైద్య వత్తిపై ఓ నిబద్ధత, ప్రణాళికా, అమితమైన ఇష్టం, సేవ గుణం వంటి తదితర లక్షణాలు ఉండాలి. అమ్మ జన్మనిస్తే.. వైద్యులు పునర్జన్మనిస్తారు. అందుకే వాళ్లను వైద్యో నారాయణోహరి అంటారు. చిలకలూరిపేట పరిసర ప్రజలకు రెండుతరాలుగా రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా సేవలందిస్తూ వస్తున్న ప్రగతి నర్సింగ్ హోమ్ 50వ సంవత్సరంలో అడుగుపెట్టింది. పేద,ధనిక భేదం లేకుండా, ‘వచ్చిన రోగికి వైద్యం చేయాలనే సంకల్పంతో 1975 సంవత్సరం జనవరి 19 తేదీన సీ.ఆర్ క్లబ్ ఎదుట మాజీ ఎంపీ స్వర్గీయ కొల్లా వెంకయ్య కుమారుడు డాక్టర్ కొల్లా రాజమోహనరావు, ఆయన సతీమణి డాక్టర్ హేమంతిదేవి ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం మారెళ్లవారివీధిలో సొంత స్థలంలో ఆసుపత్రిని ప్రారంభించారు.అప్పట్లో ఆసుపత్రి ఎదురుగా రేగు చెట్టును కొట్టి వేయాలని,ఇది అశుభమని పలువురు సూచించినా డాక్టర్ కొల్లా రాజమోహనరావు అంగీకరించలేదు. కాల క్రమేణ అదే ఆసుపత్రి రేగు చెట్టు ఆసుపత్రిగా ప్రజల్లో ప్రాచుర్యం పొందింది. ఇదే రేగుచెట్టు నాటి నుంచి ఇప్పటికి ఆసుపత్రి ఎదుట 50 ఏళ్ల వైద్యసేవల ప్రస్థానానికి సాక్షిగా నిలుస్తోంది. నాడు పట్టణంలో వైద్య సేవలు అంతగా విస్తరించని రోజుల్లో డాక్టర్ కొల్లా రాజమోహనరావు, హేమంతిదేవిల ఆధ్వర్యంలో కాన్పులు, ప్రసూతి వైద్యం, స్త్రీల సమస్యలకు సంబంధిత చికిత్సలు, చిన్నపిల్లల వైద్యం, అత్యవసర చికిత్సలకు ఈ ఆసుపత్రే కేంద్రంగా ఉండేది. దీంతో సాధారణ వైద్య సేవలు విస్తతంగా అందించేవారు. ఆరోజుల్లోనే అన్ని సదుపాయాలతో వైద్యం అందించేవారు. ఈ సందర్భంగా మేరకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ అమర్ కు ఘన సత్కారం చేయడం జరిగింది.వైద్య సేవతోపాటు సామాజిక సేవచేశారు.సమర్థులైన వైద్యులు ఎందరో ఉంటారు. సేవాభావం కలిగిన వైద్యులు కొందరే ఉంటారు. సమర్ధత, సేవాభావం రెండూ ఉన్న వైద్యులు అతికొద్దిమందే ఉంటారు. అటువంటివారిలో ముందు వరుసలో ఉంటారు డాక్టర్ కొల్లా అమర్. లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ ప్రజలతోపాటుగా, గ్రామీణ ప్రాంతంలోనూ ఉచిత వైద్య శిబిరాలు, అవగాహనా సదస్సులు నిర్వహించారు. డాక్టర్ కొల్లా రాజమోహనరావు, హేమంతిదేవిల వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని ఆసుపత్రి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కొల్లా అమర్, డాక్టర్ భాగ్యమాల ఆధ్వర్యంలో నాణ్యతతో కూడిన వైద్యాన్ని ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా సమయంలో వేలాది మంది వైద్య సేవలు అందించి, అమర్ ఇటు ప్రజల, అటు ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. వైద్య రంగం నుంచి కరోనా సమయంలో అందించిన సేవలకు ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ క్రమంలోనే ఆసపత్రిని మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిగా రూపొందించి చిన్నపిల్లల అత్యవసర చికిత్సలు, స్త్రీల సమస్యలకు సంబంధిత చికిత్సలు, ఎముకల శస్త్ర చికిత్సలు, ప్రమాద గాయాలు, సాధారణ వ్యాధుల చికిత్సలు, అత్యవసర చికిత్సలు, సాధారణ శస్త్ర చికిత్సలు, మూత్రకోశ వ్యాధులకు శస్త్ర చికిత్సలకు ప్రత్యేక విభాగాల వైద్యులను ఏర్పాటు చేసి సేవలను విస్తత పరిచారు. దీంతో ఆసుపత్రికి అనుబంధంగా డాక్టర్ భాగ్యమాల ఆధ్వర్యంలో జయ సంతాన సాఫల్య కేంద్రం త్వరలో అందుబాటులో రానుంది. వైద్యసేవలు కొనసాగింపుగా మూడో తరం డాక్టర్ సుజన్ మోహన్, విజన్మోహన్ లు, సేవలు అందిస్తారని ఆశిస్తున్నారు. తరాలుగా 50 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న ప్రగతి నర్సింగ్ హామ్ కు చేరువ అవుతారనేది గమనార్హం.