Listen to this article

జనం న్యూస్ – మే 7-నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ నెట్ బాల్ సెలక్షన్స్ ఈనెల 9వ తారీఖున శుక్రవారం నాడు నాగార్జునసాగర్ హిల్ కాలనీలో గల సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు నిర్వహించనున్నట్లు ఉమ్మడి నల్గొండ జిల్లా నెట్ బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ జె కిరణ్ కుమార్ తెలిపారు. ఈ నెట్ బాల్ సెలక్షన్స్ కు 16 సంవత్సరాల లోపు వయసుగల బాల బాలికలు అర్హులని, సబ్ జూనియర్స్ నెట్ బాల్ సెలక్షన్స్ కు హాజరు అవదలచిన క్రీడాకారులు తప్పనిసరిగా తమ యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకొని ఈనెల 9వ తారీఖున ఉదయం 9 గంటలకు నాగార్జునసాగర్ సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు హాజరు కాగలరని తెలిపారు, నెట్ బాల్ సెలక్షన్స్ కు సంబంధించిన వివరాల కొరకు ఫోన్ నెంబర్ 9160 494743 లో సంప్రదించవచ్చని తెలిపారు.