

జనం న్యూస్ జనవరి 20 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : ఆసిఫాబాద్ గ్రామపంచాయతీ మున్సిపల్ గా ఏర్పడి దాదాపు 11 నెలలు అవుతున్న ఈ మున్సిపల్ లో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు చెల్లించాలని గత పది నెలల నుండి ఆందోళన చేస్తున్న పట్టించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉదయం 9 గంటల 30 నిమిషాలు నుండి మూడు గంటల వరకు మున్సిపల్ కార్యాలయం ముట్టడి చేయడం జరిగిందిపి ఎఫ్ ఈ యస్ ఐ ఉద్యోగ భద్రత ఇతర మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు ఉన్న సౌకర్యాలు ఆసిఫాబాద్ మున్సిపల్ కార్మికులకు వర్తింపు చేయల కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ కి జిల్లా కలెక్టర్ కి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోలేదు జీవో నెంబర్ 60 ప్రకారంగా వేతనాలు ఇవ్వకుండా గ్రామపంచాయతీ కార్మికులు ఇచ్చే వేతనాలు ఇచ్చి కాలయాపన చేస్తున్నారుమున్సిపల్ కమిషనర్ భుజంగరావు వచ్చి మీకు నెల రోజుల్లోపు జీవో నెంబర్ 60 ప్రకారంగా 144 మంది కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని పి ఎఫ్ ఈయస్ఐ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారుఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు రాజేందర్ మున్సిపల్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మాట్ల రాజు సమ్మయ్య శ్రీకాంత్ సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు కృష్ణమాచారి కేవీపీయ స్ జిల్లా కార్యదర్శి దినకర్ డి వై ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు టిక నంద్ దుర్గ ప్రసాద్ ప్రభాకర్ లక్ష్మి సంధ్య పెంటూ బాయ్ పద్మ బాలేష్ ప్రభాకర్ జగదీష్ నరేష్ దుర్గయ్య శంకర్ తదితరులు పాల్గొన్నారు