

జనం న్యూస్. తర్లుపాడు మండలం. మే. 8
తర్లుపాడు మండలం చెన్నారెడ్డి గ్రామం లో గల సచివాలయం లో రీ సర్వే పై తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్బంగా తహసీల్దార్ మాట్లాడుతూ మొదటిగా గ్రామ పొలిమేర రీ సర్వే చేయడం జరిగిందని రేపటి నుండి గ్రౌండ్ ట్రూథింగ్ చేయడం జరిగితుందని చెన్నారెడ్డి పల్లి గ్రామ ప్రజలు అధికారులకు సహకరించాలని, ఏవైన సమస్యలు ఉంటే ముందుగా తమదృష్టికి తీసుకువస్తే పరిష్కారం చూపుతామని అన్నారు సచివాలయం భూ నిజనిర్ధారణ నోటీసు బోర్డు లో అంటించారు ఈ కార్యక్రమం లో మండల సర్వేయర్ శ్రీవాణి, వి ఆర్ ఓ శివకాశీ, సర్వేయర్ మస్తాన్ రెడ్డి, తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు