Listen to this article

భారతీయ జనతా పార్టీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్

జనం న్యూస్ 08 మే( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి కురిమెళ్ళ శంకర్ )

వేసవికాలంలో కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 36 వార్డులలో త్రాగునీరు రాక వారం రోజులు గడుస్తున్న మున్సిపాలిటీ సిబ్బంది గానీ అధికార పార్టీకి చెందిన నాయకులు గానీ స్పందించకపోవడం విడ్డూరం.కొత్తగూడెం పట్టణంలో కిన్నెరసాని నీటి సదుపాయం ఉన్న మరమ్మత్తుల పేరిట డబ్బులు డ్రా చేసే ఏటీఎంలో ఉపయోగపడుతుంది కానీ ప్రజల నీటి అవసరాలను తీర్చడంలో పూర్తిగా పాలక పక్షం విఫలం.* అధికారులు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం దురదృష్టకరం కొత్తగూడెం లో సింగరేణి మంచినీటి సౌకర్యం,మినీ వాటర్ స్కీం బోర్లు ఉన్నా కానీ భద్రాద్రి జిల్లా హెడ్ హెడ్ క్వార్టర్ లో కాబోయే కార్పొరేషన్ లో ఇటువంటి సమస్యలు ఉన్న అధికారులు పట్టించుకోకపోవడం ఇక్కడి ఎమ్మెల్యే అసమర్థత కాదా…కేంద్ర ప్రభుత్వం అమృత 2.0 పథకం కింద 120 కోట్లు భద్రాద్రి జిల్లాకు ఇచ్చిన ఎక్కడి పనులు అక్కడే ఉన్నవి వీటిని త్వరితగతిన ప్రజలకు అందించే అవసరం అధికారులకు పాలక పక్ష నాయకులకు లేదా అని కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తిమ్మిరి నరేంద్రబాబు, జిల్లా కౌన్సిల్ మెంబర్ ఇరెల్లి నాగేశ్వరరావు,గుంపుల మహేష్, బానోత్ రాంబాబు నాయక్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.