

జనం న్యూస్ 08 మే( కొత్తగూడెం నియోజకవర్గం ప్రతినిధి కురిమెల్ల శంకర్)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ గ్రామానికి చెందిన సత్తార్ మియా, ముంతాజ్ బేగం, దంపతుల ఏకైక కుమార్తె షేక్ సాజిదా వెడ్స్ మహమ్మద్ రైహాన్ వివాహ వేడుకలు కొత్తగూడెం క్లబ్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చండ్రుగొండ మండల బిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు సత్తి నాగేశ్వరరావు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఇనుముల సత్యనారాయణ, కాకా కృష్ణయ్య, ఇనుముల నాగరాజు, అట్ల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.