Listen to this article

జనం న్యూస్- మే 8- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

ఈనెల 12వ తేదీన మిస్ వరల్డ్ కాంపిటేటర్స్ నాగార్జునసాగర్ లోని బుద్ధవనం సందర్శిస్తున్న నేపథ్యంలో బుద్ధ వనంలో మెడికల్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ట శ్రీనివాస్ తెలిపారు. గురువారం నాడు ఆయన మెడికల్ క్యాంపు ఏర్పాటుకై బుద్ధవనం విజయ్ విహార అతిథి గృహాన్ని సందర్శించి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 12వ తేదీన మిస్ వరల్డ్ కాంపిటేటర్స్ నాగార్జునసాగర్ ను సందర్శిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బందితో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మెడికల్ క్యాంపు ఏర్పాటుపై మిస్ వరల్డ్ కాంపిటీటర్స్ సందర్శించే విజయ విహార్ అతిథిగృహం మరియు బుద్ధవనం ను పరిశీలించామన్నారు. మిస్ వరల్డ్ పోటీదారులు ఎక్కువ సమయం కేటాయించే బుద్ధవనం వద్ద మెడికల్ క్యాంపుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు. దీనితోపాటు స్థానిక కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో అన్ని వసతులతో ఆధునిక మెడికల్ ఎక్విప్ మెంట్ తో వివిధ గ్రూపులకు చెందిన బ్లడ్ ప్యాకెట్లను అందుబాటులో ఉండే విధంగా ఒక ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కేశ రవి, జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్ కృష్ణకుమారి, పెదవుర మండల వైద్యాధికారి నగేష్ ,విజయ విహార్ మేనేజర్ కిరణ్ కుమార్, బుద్ధవనం ఈవో రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.