

ప్రతినిధి (శ్రీరామ్ నవీన్) తొర్రూర్ డివిజన్ కేంద్రం… మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ దంతాలపల్లి మండల కేంద్రంలోని బొడ్లాడ స్టేజి గోప్యా తండాకు చెందిన భానోతు అనిల్ (18)తండ్రి బాలు పదవ తరగతి చదువుతున్న విద్యార్థి మృతి. ఆదివారం ఉదయం తమ వ్యవసాయ భూమిలో వ్యవసాయ పనులు చేసి సాయంత్రం ఇంటికి వచ్చి దండెం మీద బట్టలు ఆరేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్. కింద పడగా చుట్టుపక్కల వారు వచ్చి సిపిఆర్ చేసి తొర్రూరులోని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించే లోపే మరణించాడని వైద్యులు నిర్ధారించడం జరిగింది. దీంతో వారి కుటుంబంలో, విషాద ఛాయలు నెలకొన్నాయి