

జనంన్యూస్. 09. నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు.మహారాణా ప్రతాప్ జయంతి సందర్బంగా స్థానిక ఎల్లమ్మ గుట్ట చౌరస్తాలో బొందిల రజక సంఘం వారు నిర్వహించిన వేడుకలకు ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ. హాజరు కావడం జరిగింది. మొదట ఎమ్మెల్యే గారు సంఘ పెద్దమనుషులతో కలిసి రాణా ప్రతాప్ చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతు ధైర్యానికి, సౌర్యానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం రాణా ప్రతాప్ మహారాజ్ అన్నారు, మొఘలుల నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన భరతమాత ముద్దుబిడ్డ అని కొనియాడారు.ఈ దేశంలో పుట్టిన గడ్డిపరక సైతం ఈ దేశ పౌరుషాన్ని, దేశభక్తిని పాలుపంచుకుంటుంది అనడానికి నిదర్శం మహారాణ ప్రతాప్ గుర్రం చేతక్ దీనికి నిదర్శనం అన్నారు. హల్ది ఘటి యుద్ధంలో వీరోచితంగా పోరాడి తన ప్రాణప్రయస్థితిలో ఉన్న మహారాణ ప్రతాప్ ను రక్షించడానికి 26 అడుగుల కందకం పైనుండి దూకి రక్షించడమే అందుకు నిదర్శనం అన్నారు.
మహారాణా ప్రతాప్ సింగ్ మహారాజ్ విదేశీయులకు సైతం స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు
శక్తివంతమైన అమెరికా పైన రెండు దశాబ్దాలు సుదీర్ఘ పోరాటం అనంతరం విజయం సాధించిన వియత్నాదేశ అధ్యక్షుడు స్వయంగా తమ గెలుపుకు మహారాణ ప్రతాప్ సింగ్ మహారాజ్ ప్రేరణదాయకం అని పేర్కొన్న విషయాన్నీ గుర్తు చేసారు.వియత్నం విదేశాంగ శాఖ మంత్రి భారత దేశ పర్యటనకు వచ్చినప్పుడు స్వయంగా ఉదయపూర్ లో రాణా ప్రతాప్ సమాధిని దర్శించి అక్కడ ఉన్న పిడికెడు మట్టి తీసుకొని ఈ దేశ వీరత్వం ఇక్కడ ఉన్న వీరుల ప్రేరణ మా దేశాన్ని కూడా అవసరమున్నది అని చెప్పి ఆ మట్టిని తీసుకెళ్లి వియత్నం దేశ మట్టిలో కలపడం జరిగిందన్నారు. భారతదేశానికి, ఇక్కడ పుట్టిన వీరుల పౌరుషనికి ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోయాయని అన్నారు.నేడు జరుగుతున్న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చత్రపతి శివాజీ మహారాజ్, రాణా ప్రతాప్ లాంటి వీరుల స్ఫూర్తితో నేడు పాకిస్తాన్ పైన ఉగ్రవాదం పైన ఉక్కు పాదం మోపడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.