

జనం న్యూస్ మే 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి పేద ప్రజలకు పార్టీ తరపున ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. పార్టీ కె.పి.హెచ్.బి డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో శనివారం కెపిహెచ్బి కాలనీ ఏడో పేస్ లోని బాస్కెట్ బాల్ గ్రౌండ్లో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన స్వయంగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ వైద్య శిబిర నిర్వాహకులు రంగ, నితీష్ గౌడ్, ప్రవీణ్ కుమార్, పొడుగు అప్పారావు, అరవింద్ రెడ్డి ,రంగస్వామిలను అభినందించారు. భవిష్యత్తులోనూ పార్టీ నాయకులు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కూకట్పల్లి నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు శెరి సతీష్ రెడ్డి ,మేకల మైఖేల్, అంజిబాబు ,రమణ దితరులు పాల్గొన్నారు.