

జనం న్యూస్ మే 10 చిలిపి చెడు మండల ప్రతినిధి: మెదక్ జిల్లా చిలిపిచేడు మండలంరోడ్డు ప్రమాదంలో మరణించిన అజ్జమర్రి గ్రామ పన్యాల శ్రీధర్ కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ చిలుముల సుహాసిని రెడ్డిరోడ్డు ప్రమాదంలో మరణించిన చిలిపిచెడ్ మండల అజ్జమర్రి గ్రామానికి చెందిన తాజా మాజీ ఉపసర్పంచ్ పన్యాల పోచయ్య గారి కుమారుడు పన్యాల శ్రీధర్ (14 సం.) మరణించిన విషయం తెలుసుకొని అక్కడికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు.అతి చిన్న వయసులో కుమారుని కోల్పోవడం చాలా బాధాకరమని వారిని ఓదార్చారు. అలాగే రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని లైసెన్సులు కూడా పొంది ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ పరశురాం రెడ్డి, ధర్మారెడ్డి, రాజిరెడ్డి, ఎంపిటిసి మన్నె మల్లయ్య, వీరస్వామి, చిరంజీవి, గోవర్ధన్, మల్లేష్, మధు, రాజు యాదవ్ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు